Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 23 May 2020 15:23:10 IST

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ కన్నుమూత

twitter-iconwatsapp-iconfb-icon

హైదరాబాద్: ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ హరికిషన్ మృతి చెందారు. 1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు వాయిస్‌ను మిమిక్రీ చేసి హరికిషన్ బాగా ప్రాచుర్యం పొందారు. 1971లో విజయవాడలో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో హరికిషన్ మిమిక్రీ రంగంలోకి వచ్చినట్లు చెబుతారు. పలు సినిమాలు, టీవీ షోల్లో హరికిషన్ ప్రదర్శనలు ఇచ్చారు. హరికిషన్ దేశ విదేశాల్లో 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఏళ్ల  పాటు టీచర్‌గా పనిచేసిన హరికిషన్.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement