గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేసి 7 గెలిచిన ఎంఐఎం

ABN , First Publish Date - 2021-03-03T15:38:29+05:30 IST

కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను

గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేసి 7 గెలిచిన ఎంఐఎం

అహ్మదాబాద్: గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేసిన తక్కువ స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 2002లో అలర్లు జరిగిన గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేయగా 7 స్థానాలు గెలుచుకుంది. గోద్రా మున్సిపాలిటీలో ఎంఐఎం పోటీకి దిగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం విడుదలైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది. అహ్మదాబాద్ కార్పొరేషన్ పరిధిలో 4 స్థానాలను ఎంఐఎం చేజిక్కించుకుంది. ఇకపోతే, మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. బరూచ్‌లో కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది.


కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం.. కొద్ది రోజుల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఇక మొదటిసారి గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పోటీకి దిగి తగిన స్థానాల్ని గెలుచుకుంది.

Updated Date - 2021-03-03T15:38:29+05:30 IST