Owaisi కి ఝలక్ ఇవ్వనున్న MIM ఎమ్మెల్యేలు?

ABN , First Publish Date - 2022-06-08T17:20:09+05:30 IST

బిహార్‌లో ఎంఐఎంకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్‌జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది. ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీతో చర్చలు ముగిసాయని..

Owaisi కి ఝలక్ ఇవ్వనున్న MIM ఎమ్మెల్యేలు?

పాట్నా: ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)కి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఝలక్ ఇవ్వనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని ఏకంగా మరొక పార్టీలో విలీనం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ పార్టీకి చెందిన నేతలెవరైనా బలమైన స్టాండ్‌తో ఉంటారు. ఎన్నికల ముందైనా, తర్వాత అయినా వేరే పార్టీల్లోకి వెళ్లడంలాంటివి ఎక్కడా కనిపించవు. కానీ తాజాగా ఆ విధానాన్ని బ్రేక్ చేస్తూ ఏకంగా పార్టీనే వేరే పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు బలంగానే వస్తున్నాయి.


బిహార్‌లో ఎంఐఎంకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్‌జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది. ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీతో చర్చలు ముగిసాయని, తొందరలోనే విలీన ప్రక్రియ ఉంటుందనే వాదనలూ వస్తూనే ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రోజు నుంచే పెద్ద పార్టీలు తమను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయని బిహార్ ఎంఐఎం పక్ష నేత, ఎమ్మెల్యే అక్తరుల్ ఇమామ్ ఓ సందర్భంలో అన్నారు.


అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బిహార్‌లోని ఎంఐఎం ఎమ్మెల్యేల ఆలోచనలు మారిపోయాయట. ఆ ఎన్నికల్లో 90 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టిన ఎంఐఎం.. ఏ ఒక్క స్థానం గెలవకపోగా కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయింది. యూపీలో 20 శాతం ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఎంఐఎం కేవలం ఒకే ఒక్క శాతం ఓట్ బ్యాంక్‌కు పరిమితమైంది. వచ్చే రోజుల్లో బిహార్‌లో సైతం ఇవే పరిస్థితులు రావొచ్చని ఎంఐఎం నేతలు భావిస్తున్నారట. తమ భవిష్యత్‌ను దృష్టిల్లో పెట్టుకుని ఆర్జేడీలోకి వెళ్తే 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అస్థిత్వాన్ని నిలుపుకోవచ్చని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇదెంత వరకు వాస్తవమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2022-06-08T17:20:09+05:30 IST