ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే అంతే

ABN , First Publish Date - 2021-03-07T05:42:09+05:30 IST

ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే ఇక అంతే.. అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. శనివారం ధనుష్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎంఐఎం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే అంతే
మాట్లాడుతున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

  1. 2023 జమిలి ఎన్నికల్లో  పోటీ చేయిస్తాం
  2. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ


ఆదోని, మార్చి 6: ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే ఇక అంతే.. అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. శనివారం ధనుష్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎంఐఎం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ ఎంఐఎంకి పురపాలక ఎన్నికల సభకు అనుమతి అడిగితే పోలీసులు ఇవ్వలేదన్నారు. శనివారం పట్టణ శివారులోని ఓ ఫంక్షన్‌ హాల్‌ను కేటాయించడంపై పోలీసులను తప్పుపట్టారు. శుక్రవారం ఓ ద్విచక్ర వాహనంలో పట్టణమంతా తిరిగానని ఎవరూ అడ్డుకోలేకపో యారన్నారు. ఎంఐఎంను చూసి భయపడిపోతున్నారన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తాను మంత్రి కావాలనే ఆశతో 9 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఏమైనా బాగుంటుందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం పోటీ చేస్తున్న 9 వార్డులను గెలిపించుకుంటామన్నారు. ఇలాగే కొనసాగితే 2023 జమిలి ఎన్నికల్లో ఆదోని ఎమ్మెల్యే స్థానానికి ఎంఐఎం అభ్యర్థిని నిలబెడతామన్నారు. అప్పుడు ఎంఐఎం సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. నరేంద్ర మోదీ విధానాల వల్ల పెట్రోల్‌ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ కార్పొరేట్‌ సలీంబేగ్‌, ఆదోని ఎంఐఎం నాయకులు ఉమ్మాయూసుఫ్‌, ఉమ్మిసలీం, అజీమ్‌, నూర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T05:42:09+05:30 IST