హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం బోణీ

ABN , First Publish Date - 2021-03-14T21:19:01+05:30 IST

హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం బోణీ కొట్టింది. 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు.

హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం బోణీ

అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం బోణీ కొట్టింది. 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు. ఎంఐఎం ప్రధానంగా రాయలసీమపై దృష్టి సారించింది. హిందూపురంలో తప్ప మరెక్కడ ఎంఐఎం గెలువలేదు. గతంలో కర్నూలు జిల్లాకే పరిమితమైన ఆ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో పోటీ చేసింది. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లో పోటీ చేసింది. విజయవాడ కార్పొరేషన్‌లో 50, 54 డివిజన్లలో పోటీలో తలపడ్డారు. ఇక కడప జిల్లాలో ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని ఆదోని, అనంతపురం జిల్లాలో హిందూపురం ముస్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎంఐఎం బరిలో దిగడం వెనుకు ఓ వ్యూహం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ఎలా అంటే టీడీపీ, వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను దింపారని పలువురు చెబుతున్నారు. టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న ముస్లిం ఓటు బ్యాంకును చీల్చాడానికే ఎంఐఎం పోటీలో నిలబడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఐఎం ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారనే విమర్శలు వెల్లవెత్తున్నాయి. మొత్తంగా టీడీపీని దెబ్బకొట్టేందుకు ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సమయం కోసం ఎదురుచూసిన ఒవైసీ ఇప్పుడు తన పాచికలకు పని చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది.

టీడీపీ, వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను దింపారని చెబుతున్నారు. దీంతో టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న ముస్లిం ఓటు బ్యాంకును చీల్చాడానికే ఎంఐఎం పోటీలో నిలబడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓట్ల చీలక వల్ల వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారనే విమర్శలు వెల్లవెత్తున్నాయి. మొత్తంగా టీడీపీని దెబ్బకొట్టేందుకు ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సమయం కోసం ఎదురుచూసిన ఒవైసీ ఇప్పుడు తన పాచికలకే పని చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది.



Updated Date - 2021-03-14T21:19:01+05:30 IST