బర్గర్ కోసం రూ. 2లక్షలు ఖర్చు చేసి.. 725కిలో మీటర్లు ప్రయాణించారు!

ABN , First Publish Date - 2020-12-04T21:38:31+05:30 IST

మీకు బందరు లడ్డూలు తినాలనిపించిందనుకోండి.. ఏం చేస్తారు..? దగ్గరలోని స్వీట్ షాపునకు వెళ్లి కొనుక్కుంటారు.. అక్కడ కూడా అవి లేకుంటే మరికొంచెం దూరమయినా వెళ్లి లడ్డూలను తీసుకొచ్చు

బర్గర్ కోసం రూ. 2లక్షలు ఖర్చు చేసి.. 725కిలో మీటర్లు ప్రయాణించారు!

మాస్కో: మీకు బందరు లడ్డూలు తినాలనిపించిందనుకోండి.. ఏం చేస్తారు..? దగ్గరలోని స్వీట్ షాపునకు వెళ్లి కొనుక్కుంటారు.. అక్కడ కూడా అవి లేకుంటే మరికొంచెం దూరమయినా వెళ్లి లడ్డూలను తీసుకొచ్చుకుంటారు.. అక్కడ కూడా దొరక్కపోతే ఇంట్లో అయినా తయారు చేయించుకుని సరిపుచ్చుకుంటారు.. అంతే కానీ.. పనిగట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించి.. వేల రూపాయలు ఖర్చు చేసి.. వంద రూపాయల విలువ చేసే లడ్డూలను అయితే కొనక్కొచ్చుకోరు కదా.. తినడానికి కొనుక్కున్న ఆహారపదార్థమేమో వందల్లో ఉంటే.. దాన్ని కొనక్కొచ్చుకోవడానికి అయే ప్రయాణ ఖర్చులయితే వేలల్లో ఉండేలా చేయం కదా.. పనిమీద ఎప్పుడైనా అటుగా వెళ్తే కొనుక్కుని సంతృప్తి పడతాం.. మనసారా ఆ టేస్ట్‌ను ఆస్వాదిస్తాం.. కానీ ఓ వ్యక్తి మాత్రం కేవలం 5వేల రూపాయలు అయ్యే వెరైటీ ఆహార పదార్థాన్ని తినడానికి ఏకంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.. వినడానికి వింతగా ఉంది కదూ.. ఇది నిజంగా జరిగింది.. కాకపోతే ఇక్కడ కాదులేండి.. రష్యాలో...  పూర్తి వివరాల్లోకి వెళితే..



రష్యాకు చెందిన 33ఏళ్ల విక్టోర్ మార్టినోవ్ మాస్కోలోని ఓ సంస్థలో సీఈఓగా పని చేస్తున్నారు. ఈయన తన ప్రేయసితో సరదగా గడిపేందుకు కొద్ది రోజుల క్రితం అలుస్తా ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ లభించే ఫుడ్‌ వారికి నచ్చలేదు. దీంతో దగ్గరలో ఉన్న మెక్‌డోనల్స్ ఔట్‌లెట్‌కు వెళ్లి ఏదైనా స్పైసీ ఫుడ్ తినాలనుకున్నారు. అయితే వారు ఉన్న ప్రదేశంలో మెక్‌డోనల్స్ రెస్టారెంట్‌‌లు లేవు. దీంతో 725 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్‌డోనల్స్ రెస్టారెంట్‌కు వెళ్లేందుకు సుమారు 2000పౌండ్ల (దాదాపు రూ.2లక్షల)ను ఖర్చు పెట్టి విక్టోర్ మార్టినోవ్.. ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ను బుక్ చేశాడు. అనంతరం ఆ రెస్టారెంట్‌కు వెళ్లి.. 49డాలర్ల (సుమారు రూ.5వేలు) చేసే బర్గర్‌ను తినేసి తిరిగొచ్చారు. కాగా.. ఈ విషయాన్ని స్వయంగా ఓ వీడియో ద్వారా విక్టోర్ మార్టినోవే చెప్పాడు. ‘నేను నా గర్ల్‌ఫ్రెండ్ ఇక్కడ దొరికే ఫుడ్‌తో విసిగిపోయాం. దీంతో మాస్కో‌లో సాధారణంగా లభించే ఫుడ్‌ను తినాలనుకున్నాం. అందుకే హెలికాప్టర్‌ను బుక్ చేసి క్రాస్నోడర్‌కు వెళ్లాం’ అంటూ చెప్పుకొచ్చాడు.


Updated Date - 2020-12-04T21:38:31+05:30 IST