సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ నివాస్
కృష్ణవరంలో కలెక్టర్ నివాస్
ఆగిరిపల్లి, జనవరి 27: ప్రయివేటు డెయిరీల దోపిడీకి అడ్డు కట్టవేయడమే జగనన్న పాలవెల్లువ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. కృష్ణవరంలో గురువారం జగనన్న పాలవెల్లువ పథకం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడిరైతులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాలవెల్లువ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమూల్ రుణాలు అందిస్తుందని చెప్పారు. పాలవెల్లువలో 10 రోజులకు ఒకసారి బిల్లుల చెల్లింపులు జరుపుతారన్నారు. మండలంలో పాల సేకరణ ఆశాజనంగా ఉందని, మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గ్రామసచివాలయాన్ని తనిఖీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఆదేశించారు. తహసీల్దార్ వి.వి.భరత్‌రెడ్డి, ఈవోపీఆర్డీ బి.సుహాసిని, గ్రామ సర్పంచ్ కమ్మిలి జ్యోతి పాల్గొన్నారు.