సికింద్రాబాద్‌లో మిల్కా సింగ్‌ కాలనీ

ABN , First Publish Date - 2020-07-02T09:14:02+05:30 IST

మిల్కాసింగ్‌ కాలనీ.. ఇది ఎక్కడో లేదు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలోని ఈఎమ్‌ఈ సెంటర్‌లో ఉంది. భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం...

సికింద్రాబాద్‌లో మిల్కా సింగ్‌ కాలనీ

అథ్లెటిక్స్‌ దిగ్గజానికి కంటోన్మెంట్‌ వాసుల గౌరవం

హైదరాబాద్‌ : మిల్కాసింగ్‌ కాలనీ.. ఇది ఎక్కడో లేదు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలోని ఈఎమ్‌ఈ సెంటర్‌లో ఉంది. భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం 90 ఏళ్ల మిల్కా ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ 8 ఏళ్లు  నివాసం ఉన్నాడు. అందుకు గుర్తుగా.. ఆ ప్రాంత వాసులు కాలనీకి పేరు పెట్టుకొని మిల్కాను ఇలా గౌరవించుకున్నారు. ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన మిల్కా సింగ్‌ 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో కొద్దిలో పతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.  అప్పట్లో కంటోన్మెంట్‌ ఏరియాలోని తన బ్యారక్‌ నుంచి మిల్కా ప్రతిరోజూ ఉదయం సాధన చేసేవాడు. ఇక్కడ ప్రాక్టీస్‌ చేయడం తనకు కెరీర్‌లో కలిసొచ్చిందనీ.. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు గెలుచుకోగలిగానని మిల్కా చెప్పాడు. ‘నా పేరుమీద కాలనీ పెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. సికింద్రాబాద్‌లో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆర్మీ విధుల్లో భాగంగా ఈఎమ్‌ఈ సెంటర్‌కు నన్ను రిక్రూట్‌ చేశారు. ఎనిమిదేళ్లు అక్కడ గడిపా. ఈఎమ్‌ఈ సెంటర్‌లోని మసీదుకు దగ్గర్లో ఓ కొండ (అమ్ముగడ్డ పహడ్‌) ఉండేది. ఆర్మీ యూనిట్‌తో కలిసి ఆ కొండను ఎక్కేవాణ్ని. ఇది నాకు కెరీర్‌పరంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఎంతో దోహదం చేసింది’ అని గత స్మృతులను మిల్కా గుర్తు చేసుకున్నాడు. 

Updated Date - 2020-07-02T09:14:02+05:30 IST