శిశువులకు మిల్క్‌బ్యాంకుల పాలనూ ఇవ్వొచ్చు: హెచ్‌ఎంబీఏ

ABN , First Publish Date - 2020-08-10T07:13:21+05:30 IST

ఏదైనా కారణం వల్ల శిశువుకు తల్లి పాలు అందకుంటే.. మిల్క్‌ బ్యాంక్‌లలో లభించే పాలను ఇవ్వొచ్చని హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంబీఏ) అధ్యక్షుడు కేతన్‌ భారద్వ తెలిపారు...

శిశువులకు మిల్క్‌బ్యాంకుల పాలనూ ఇవ్వొచ్చు: హెచ్‌ఎంబీఏ

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఏదైనా కారణం వల్ల శిశువుకు తల్లి పాలు అందకుంటే.. మిల్క్‌ బ్యాంక్‌లలో లభించే పాలను ఇవ్వొచ్చని హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంబీఏ) అధ్యక్షుడు కేతన్‌ భారద్వ తెలిపారు. అయితే అవి దాతల నుంచి సేకరించిన పాశ్చరైజ్డ్‌ పాలై ఉండాలని స్పష్టం చేశారు. హోల్డర్‌ పాశ్చరైజేషన్‌ (హెచ్‌ఓపీ) ప్రక్రియ పాలలోని వైర్‌సను అంతమొందిస్తుందని పలు సైంటిఫిక్‌ జర్నల్‌లలో అధ్యయన నివేదికలు ప్రచురితమైన విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. హెచ్‌ఓపీ పద్ధతిలో పాలను 62.5 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత వద్ద అరగంట పాటు వేడిచేసి చల్లార్చుతారని, ఫలితంగా దానిలో వైర్‌సలు, ఇతర క్రిముల జాడ ఉండదని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-10T07:13:21+05:30 IST