మట్టిపాలు చేశారు..

ABN , First Publish Date - 2021-08-06T06:31:50+05:30 IST

ప్రభుత్వం అంగన్‌ వాడీలకు ఇచ్చే జగ నన్న పాలు మట్టిపాలు అయ్యాయి. ప్రభుత్వం కాంట్రాక్టర్‌ల ద్వారా పాలను అంగన్‌వాడీలకు సరఫరా చేస్తోంది.

మట్టిపాలు చేశారు..
ఎక్సకావేటర్‌తో తవ్వుతున్న దృశ్యం

తల్లులు, పిల్లలకు అందాల్సిన పాలు గుంత తీసి పూడ్చిపెట్టిన వైనం

స్థానికుల ఫిర్యాదుతో బహిర్గతం: పర్యవేక్షణ లోపమే కారణమా.?

వర్షానికి చెడిపోవడంతోనే: కాంట్రాక్టర్‌


కదిరి, ఆగస్టు 5: ప్రభుత్వం అంగన్‌ వాడీలకు ఇచ్చే జగ నన్న పాలు మట్టిపాలు అయ్యాయి. ప్రభుత్వం కాంట్రాక్టర్‌ల ద్వారా పాలను అంగన్‌వాడీలకు సరఫరా చేస్తోంది. అనం తపురం జిల్లా కదిరి తూర్పు, పడమర ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 500 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వా టన్నిటీకి పాలను కాంట్రాక్టర్‌లు సరఫరా చేస్తున్నారు. అయితే వాటిని భద్రంగా అంగన్‌వాడీలకు చేర్చడం కాంట్రాక్టర్‌ బాధ్యత. గత నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కాంట్రాక్టర్‌లు నిల్వ చేసిన పాల గౌడోన్‌లోనికి నీళ్లు వెళ్లాయి. దీంతో పాల ప్యాకెట్లు చెడిపోయాయి. వాటిని ఎక్కడ వేయాలో తెలియక కాంట్రాక్టర్‌ తనకు ఇష్టమొచ్చిన విధంగా పారవేశారు. మొదట మండలంలోని కౌలేపల్లికి సమీపంలో పొలాల్లో వందలాది పాలప్యాకెట్లు పడేశారు. స్థానికులు ప్యాకెట్ల సమాచారం ఐసీడీఎస్‌ అధికా రులకు అందజేయడంతో వారు అరా తీశారు. ఇంత లోపే పట్టణానికి సమీపంలోని పుట్టమా నుచెరువు, ఎల్లప్పకుంటల్లో వందల్లో పాల ప్యాకెట్లను గుంత తవ్వి పూడ్చిపెట్టినట్లు కాం ట్రాక్టర్‌ అధికారులకు తెలిపాడు. వాటిని ఎక్సకావేటర్‌ సాయంతో బయటకు తీయిం చారు. పాల ప్యాకెట్లపై తేదీని బట్టీ మరో 60 రోజులు వాటిని వాడడానికి సమయం ఉంది. అయితే పాలు నిల్వ చేసే గౌడోన్‌లోనికి వర్షపు నీరు చేరడంతో పాలు పూర్తిగా చెడిపోయి ప్యా కెట్లు ఉబ్బి పోయాయి. దీంతో వాటిని కాం ట్రాక్టర్‌ అవిధంగా చేసినట్లు తూర్పు ఐసీడీఎస్‌ సీడీపీ ఓ సాజిదా బేగం తెలిపారు. అయితే కాంట్రా క్టర్‌ నుంచి పాలకు అయిన మొత్తాన్ని వసూ లు చేస్తామని చెప్పారు.


పర్యవేక్షణ లోపంతోనే..

ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణ లోపంతేనే పసిపిల్లల పాలు మట్టిపాలు అయ్యాయి. అం గన్‌ వాడీలకు పాలు సరఫరా గురించి సూపర్‌ వైజర్‌లు నిత్యం పర్యవేక్షణ చేయాలి. అయితే సిబ్బంది తక్కువగా ఉండడంతో పాలు పర్య వేక్షణ లోపంతోనే పాల సరఫరా గురించి ప ట్టించుకోలేదు. అందువల్ల  కాంట్రాక్టర్‌ ని ర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. గౌడోన్‌ పూ ర్తి స్థాయి పరిశీలించకుండానే నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఐసీడీఎస్‌ పనితీరుపై విమర్ళలు వెలువెత్తున్నాయి.




Updated Date - 2021-08-06T06:31:50+05:30 IST