Abn logo
Jun 17 2021 @ 08:48AM

పాల ఉత్పత్తిదారుల వినూత్న నిరసన


ప్యారీస్‌(చెన్నై): రైతుల నుంచి కొనుగోలు చేసే పాలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, పూర్తిస్థాయిలో పాలు కొనుగోలు చేయాలని కోరుతూ ధర్మపురి జిల్లా మోరాప్పూర్‌కు చెందిన రైతులు వినూత్న నిరసన తెలిపారు. మోరాప్పూర్‌, తేంగానూర్‌ తదితర 20 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 200 మంది కో-ఆపరేటివ్‌ సంఘం ముందు పాలను రోడ్డుపై పారబోసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.