పాల సేకరణ నాణ్యతా, ప్రమాణాలతో ఉండాలి

ABN , First Publish Date - 2021-02-27T05:47:19+05:30 IST

సొసైటీల నుంచి ఒంగోలు డెయిరీకి వస్తున్న పాలలో నా ణ్యత ప్రమాణాల్లో తేడాలు రాకుండా చూడాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.

పాల సేకరణ నాణ్యతా, ప్రమాణాలతో ఉండాలి
పాలసేకరణ యూనిట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ భాస్కర్‌

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశం


ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 26 : సొసైటీల నుంచి ఒంగోలు డెయిరీకి వస్తున్న పాలలో నా ణ్యత ప్రమాణాల్లో తేడాలు రాకుండా చూడాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. ఒంగోలులో ని డెయిరీ పాలసేకరణ యూనిట్‌ను శుక్రవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. గ్రామాల్లోని సొసైటీల ను ంచి ఒంగోలు డెయిరీ, అమూల్‌ సంస్థకు అందు తున్న పాలలో వెన్నశాతం కొలవడం వంటి పరీ క్షా విధానాలను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాడిరైతులకు ఎ టువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకోవాల న్నారు. అనలైజర్లు సరిగా క్లినింగ్‌ చేయకుండా సొసైటీ స్థాయిలో వెన్న, ఘనపదార్థాలు, ఏఎంసీ యూలను ఒంగోలు పాలసేకరణ యూనిట్‌కు తె ప్పించడం సరికాదన్నారు.  క్షేత్రస్థాయిలో పాలను కల్తీ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. గేదెపాలలో వెన్న 6.0 శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 90శాతంగా, ఆవుపాలలో వె న్న 3.2శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ 8.7శాతం ఉండేలా పాల సేకరణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. కార్యక్రమంలో అమూల్‌ సంస్థ ప్రతినిధి ధీరజ్‌, ఏపీడీడీసీఎఫ్‌ మేనేజర్‌ రాజమో హన్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రజలు భాగస్వాములు కావాలి


పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల ందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పిలుపునిచ్చారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కా ర్యక్రమంలో భాగంగా స్పందనభవన్‌లో కలెక్టర్‌ పలు అంశాలపై అవగాహన కల్పించారు. సమా వేశంలో జేసీ చేతన్‌, మెప్మా పీడీ రఘు, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సుందరరామిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-02-27T05:47:19+05:30 IST