సైనిక దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-17T05:24:04+05:30 IST

సైనిక దినోత్సవం

సైనిక దినోత్సవం
కులకచర్లలో బిపిన్‌ రావత్‌కు నివాళి అర్పిస్తున్న నాయకులు

కులకచర్ల: సైనిక దినోత్సవాన్ని శనివారం సాయంత్రం కులకచర్ల చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ చిత్రపటానికి యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం ప్రతి ఇంటి నుంచీ ఒకరు సైన్యంలో చేరాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఎన్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్‌, ఆర్మీ ఉద్యోగులు మహేశ్‌, శ్రీనివాస్‌, సత్యయ్య, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:24:04+05:30 IST