Abn logo
Jan 21 2021 @ 15:32PM

ధార్మిక సంస్థలను హిందువులే పరిరక్షించుకోవాలి: మిలిందు పరాండే

నెల్లూరు: ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలిందు పరాండే ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధార్మిక సంస్థలు, నిర్వాహకులపై ప్రభుత్వ అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. ధార్మిక సంస్థల పరిరక్షణను హిందువులే పరిరక్షించుకోవాలని పిలుపు ఇచ్చారు. దేవాలయాలపై దాడులకు పాల్పడే వారెవరైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పని లేకుండా ధార్మిక సంస్థలను మేమే సంఘటితంగా కాపాడుకుంటామని పరాండే అన్నారు.

Advertisement
Advertisement
Advertisement