మైలారం రైతులు భూసేకరణకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-06-06T10:24:20+05:30 IST

మైలారం రైతులు కాల్వల నిర్మాణానికి భూసేకరణకు సహకరించాలని కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే రసమయి

మైలారం రైతులు భూసేకరణకు సహకరించాలి

జిల్లా కలెక్టర్‌ శశాంక


గన్నేరువరం జూన్‌ 5; మైలారం రైతులు కాల్వల నిర్మాణానికి భూసేకరణకు సహకరించాలని కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు గుండ్లపల్లి, గునుకులకొండాపూర్‌, జంగపల్లి, మాదాపూర్‌లో పర్యటించి కాలువలను, చెరువులను పరిశీలించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించారు.


మైలారం గ్రామంలో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి గ్రామాలకు కాల్వల ద్వారా నీరు రావడానికి రైతుల నుంచి భూసేకరణ కోసం చర్చించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ గ్రామంలో రైతులు ముందుకు వచ్చి 45 ఎకరాల భూములు ఇస్తున్నారని అన్నారు. భూములు కోల్పోవుతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరానికి రూ.9 లక్షలు ఇస్తుందని తెలిపారు. టమాటా రైతులకు ప్రాసెసింగ్‌ యూనిట్‌, గొర్రెల కాపరులకు ఊరు బయటి షెడ్ల నిర్మాణాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ గుడెల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:24:20+05:30 IST