మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-10-19T05:14:41+05:30 IST

మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు

మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు

  • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మహమ్మద్‌ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం బోఽధించారని, వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలన్నారు. మహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని ఆమె సూచించారు. 

Updated Date - 2021-10-19T05:14:41+05:30 IST