భక్తిభావంతో మిలాద్‌ ఉన్‌ నబీ

ABN , First Publish Date - 2021-10-20T04:40:24+05:30 IST

ముస్లింల ఆరాధ్య దైవమైన మహ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు మంగళవారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భక్తిభావంతో జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, సదాశివపేట, కోహీర్‌, జహీరాబాద్‌ ప్రాంతాలతో పాటు సంగారెడ్డిలోని వివిధ కాలనీల్లో ని ఈద్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

భక్తిభావంతో మిలాద్‌ ఉన్‌ నబీ
మెదక్‌ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు

 సంగారెడ్డిరూరల్‌/మెదక్‌కల్చరల్‌, అక్టోబరు19: ముస్లింల ఆరాధ్య దైవమైన మహ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు మంగళవారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భక్తిభావంతో జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, సదాశివపేట, కోహీర్‌, జహీరాబాద్‌ ప్రాంతాలతో పాటు సంగారెడ్డిలోని వివిధ కాలనీల్లో ని ఈద్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. సంగారెడ్డి పట్టణంలోని మదీనా చౌరస్తా నుంచి ముస్లింలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మదీనా చౌరస్తా పరిసర ప్రాంతంలో మహ్మద్‌ ప్రవక్త జీవిత విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నది. ఈ వేడుకల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తనయుడు చింతా సాయినాథ్‌ పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ శాంతికి ప్రతిరూపమైన పావురాలను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం ముస్లిం యువకులు పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ షేక్‌ సాబేర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఆర్‌.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి టౌన్‌ సీఐ రమేష్‌, ముస్లిం మత పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో మిలాద్‌ ఉన్‌ నబీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం యువకులు పట్టణ వీధులు, ప్రధాన రహదారి మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాంనగర్‌కు చెందిన యువకులు షర్బత్‌ పంచారు. అలాగే పట్టణంలోని బావార్చి హోటల్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో హోటల్‌ యజమాని రవూఫ్‌, ఖుద్దూస్‌, యువకులు తాహెర్‌ బాంబే పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-20T04:40:24+05:30 IST