Abn logo
May 22 2020 @ 12:50PM

మై హ్యాపీ ప్లేస్ @ రానా: మిహిక

`ప్రియమైన రానాతో జీవితం ప్రారంభం` అంటూ మిహికా బజాజ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. గురువారం దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ రోకా ఫంక్షన్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలోని ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి.. `ఇక, మా బంధం అధికారికమైంది` అంటూ దగ్గుబాటి రానా కామెంట్ చేశాడు. 


మిహికా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రోకా ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. పక్కపక్కనే కూర్చున్న తమ ఫొటోను పోస్ట్ చేస్తూ.. `మై హ్యాపీ ప్లేస్ @ రానా` అని కామెంట్ చేశారు. అలాగే ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి.. `ప్రియమైన రానాతో నా జీవితం ప్రారంభం` అని కామెంట్ చేశారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, నెటిజన్లు మిహికకు శుభాకాంక్షలు తెలియజేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

రానా-మిహికా రోకా ఫంక్షన్ ఫొటోలుఇక అఫీషియల్.. వైరల్ అవుతున్న రానా ట్వీట్!


Advertisement
Advertisement
Advertisement