Abn logo
Oct 17 2020 @ 18:24PM

ఇది రానా కోసమే: మిహీకా బజాజ్‌

Kaakateeya

కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోలు కొందరు బ్యాచ్‌లర్‌ హోదాను కోల్పోయారు. అందులో నితిన్‌, నిఖిల్‌తో పాటు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని అంతా అనుకుంటున్న అప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అయిన రానా దగ్గుబాటి కూడా తన హోదాను కోల్పోయారు. అయితే రానా ప్రేమ గురించి అలా వార్తలు వచ్చాయో.. లేదో, అతి తక్కువ సమయంలోనే వారి పెళ్లిని పెద్దలు చేసేశారు. ఆ తర్వాత రానా, మిహీకా బజాజ్‌ జంట వార్తల్లో చాలా తక్కువగానే ఉంటూ వచ్చారు. తాజాగా మరోసారి వారు వార్తల్లో నిలిచారు. 

రానా భార్య మిహీకా బజాజ్‌ సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన పిక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. వీరిద్దరూ హనీమూన్‌లో ఉన్నట్లుగా తెలుపుతున్న ఈ ఫొటోపై ఆమె చేసిన కామెంట్‌ కూడా అదే తెలియజేస్తుంది. ఈ సెల్ఫీ రానా కోసమే అన్నట్లుగా మిహీకా తెలిపింది. పెళ్లి తర్వాత రానా దంపతులని ఇలా చూసిన వారంతా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement