క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారికి కండోములు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-03T02:54:07+05:30 IST

అవాంఛిత గర్భధారణను నియంత్రించేందుకు బీహార్ ప్రభుత్వం క్వారంటైన్ పూర్తి చేసుకున్న వలస కూలీలకు ఉచితంగా

క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారికి కండోములు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం

పాట్నా: అవాంఛిత గర్భధారణను నియంత్రించేందుకు క్వారంటైన్ పూర్తి చేసుకున్న వలస కూలీలకు బీహార్ ప్రభుత్వం ఉచితంగా కండోములు పంపిణీ చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 30 లక్షల మంది రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే రెండు వారాల క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకోగా, మరికొందరు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అవాంఛిత గర్భధారణను నియంత్రించేందుకు ఇళ్లకు చేరుకున్న వారితో పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి ఉచితంగా కండోములు పంపిణీ చేయాలని రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్ ఉత్పల్ దాస్ తెలిపారు. కేర్‌ ఇండియా సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని, దీనికీ.. కోవిడ్-19కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-03T02:54:07+05:30 IST