క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఉరేసుకున్న వలస కార్మికుడు

ABN , First Publish Date - 2020-05-30T00:14:55+05:30 IST

జగదీష్ ప్రసాద్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం సూరత్ వెళ్లాడు. ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరిలాగే అతడూ స్వస్థలానికి పయనమయ్యాడు. మే 20న సొంతూరికి వచ్చాక అతడిని క్వారంటైన్‌లో

క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఉరేసుకున్న వలస కార్మికుడు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వలస కార్మికుడు క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్‌పూర్ గ్రామంలో జరిగిందీ సంఘటన.


జగదీష్ ప్రసాద్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం సూరత్ వెళ్లాడు. ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరిలాగే అతడూ స్వస్థలానికి పయనమయ్యాడు. మే 20న సొంతూరికి వచ్చాక అతడిని క్వారంటైన్‌లో వేశారు. బుధవారం క్వారంటైన్ నుంచి తప్పించుకున్న జగదీష్, ఆ మర్నాడు (గురువారం) అతడి మామ ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.


జగదీష్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం వివాహ సంబంధిత కారణాలు ఉండొచ్చని స్థానిక ఎస్‌హెచ్‌ఓ పేర్కొన్నారు. బుధవారం మామ ఇంటికి చేరుకున్న జగదీష్.. భార్య రాజ్కాలీతో రేషన్ కొనుగోలు గురించి తీవ్రంగా గొడవపడ్డాడు. మనస్థాపంతో ఆ మర్నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-30T00:14:55+05:30 IST