గుంటూరు జిల్లాలో వలస కూలీలు

ABN , First Publish Date - 2020-03-29T10:03:26+05:30 IST

కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో వలస కూలీలు

సొంతూరుకు చేర్చాలని ఆంధ్రజ్యోతికి ఫోన్‌  


కోడుమూరు, మార్చి 28: కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. కోడుమూరు మండలం కల్లపరి గ్రామానికి చెందిన 23 మంది బతుకు తెరువు కోసం రెండు నెలల కిందట గుంటూరు జిల్లాకు వలస వెళ్లారు. గురజాల నియోజకవర్గం మదనపాడులో  వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగించే వాళ్లు.


కరోనా వైరస్‌ కారణంగా  10 రోజుల నుంచి అక్కడి రైతులు వ్యవసాయ పనులను నిలిపి వేశారు. దీంతో పనులు లేక  పూట గడవడం కష్టంగా ఉందన్నారు. తమ జిల్లాకు పంపించే ఏర్పాటు చేయాలని గురుజాల అధికారులను వేడుకొన్నప్పటికీ స్పందించడం లేదని కల్లపరి గ్రామానికి చెందిన కరుణాకర్‌, పెద్దయ్య, గుంటెప్ప, రాజు శనివారం ఆంధ్రజ్యోతి ప్రతినిధినికి ఫోన్‌ చేసి బోరున విలపించారు. స్వగ్రామానికి రప్పించే విధంగా కలెక్టర్‌  చర్యలు తీసుకోవాలని వలస కూలీల కుటుంబ సభ్యులు కోరారు.

Updated Date - 2020-03-29T10:03:26+05:30 IST