అద్దె కట్టాలంటూ ఒత్తిడి.. విషం తాగిన వలస కార్మికుడు!

ABN , First Publish Date - 2020-05-20T01:03:09+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.

అద్దె కట్టాలంటూ ఒత్తిడి.. విషం తాగిన వలస కార్మికుడు!

గురుగ్రాం: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. పనులు లేక ఆహారం సంపాదించుకోవాలన్నా వారికి కష్టమవుతోంది. ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండాల్సిందిపోయి.. అద్దె చెల్లించాలంటూ ఒత్తిడి చేశాడో ఇంటి యజమాని. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోయిన సదరు వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిసాలోని గురుగ్రాంలో జరిగింది. ఈ ఘటనలో సదరు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కుటుంబానికి సమాచారం అందించామని చెప్పారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి రావడం కుదరలేదని, ప్రస్తుతానికి శవాన్ని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-20T01:03:09+05:30 IST