మునిసిపాలిటీలో అర్ధరాత్రి బీభత్సం

ABN , First Publish Date - 2022-01-18T05:55:45+05:30 IST

ముని సిపాలిటీ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైక్‌లతో పాటు, ఓ కారును పాక్షికంగా దగ్ధం చేయడం కలకలం పుట్టిం చింది. ఈ రెండు ఘటనలు ఒకే సమ యంలో జరగడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

మునిసిపాలిటీలో అర్ధరాత్రి బీభత్సం
బైక్‌ దగ్ధం అవుతున్న దృశ్యం


 వేర్వేరు ప్రాంతాల్లో రెండు బైక్‌లు, కారు దగ్ధం 

 ఒకే సమయంలో రెండు ఘటనలు

 ఆందోళనలో పట్టణవాసులు  

  సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు

నర్సీపట్నం, జనవరి 17 : ముని సిపాలిటీ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైక్‌లతో పాటు, ఓ కారును పాక్షికంగా దగ్ధం చేయడం కలకలం పుట్టిం చింది. ఈ రెండు ఘటనలు ఒకే సమ యంలో జరగడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేఎల్‌పురం గ్రామానికి చెందిన సుర్ల ఎర్రినాయుడు నర్సీపట్నం దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో నైట్‌ వాచ్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఇతని ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో ఆయన కుమారుడు శ్రీను కేఎల్‌పురం నుంచి బైక్‌పై ఆదివారం రాత్రి ఆలయానికి వచ్చి కాపలాగా పడుకున్నాడు. అర్ధరాత్రి రెండు గం టలు దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అలాగే, సుబ్బారాయుడుపాలెం పెట్రోల్‌ బంక్‌ వద్ద పార్కింగ్‌ చేసి ఉన్న బైక్‌,  కారును సైతం ఈ విధం గానే దగ్ధం చేశారు.బంకులో పని చేస్తున్న రాజేశ్వరరావు ఆదివారం తన బైక్‌ను బంక్‌ యజమాని కారు పక్కన పార్కింగ్‌ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పు పెట్టారు. దీంతో బైక్‌ పూర్తిగా, కారు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ రెండు సంఘటనలు ఒకే సమయంలో జరగడం గమనార్హం. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదిలావుంటే, మునిసిపాలిటీలో ఎన్నడూ లేని విధంగా ఈ రకమైన ఘటనలు జరగడంపై అంతా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు పహరాను మరింత పెంచి ఇటువంటి వారి దుశ్చ ర్యలను అరికట్టాలని  కోరుతున్నారు.

Updated Date - 2022-01-18T05:55:45+05:30 IST