అర్ధరాత్రి.. అతలాకుతలం

ABN , First Publish Date - 2022-05-17T05:23:55+05:30 IST

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంట పాటు కురిసింది.

అర్ధరాత్రి.. అతలాకుతలం
ధాన్యం ఎత్తుతున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

నేలరాలిన మామిడి

కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం

కూలిన చెట్లు...విద్యుత్‌ స్తంభాలు

లబోదిబో మంటున్న రైతులు

జగిత్యాల, మే 16 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంట పాటు కురిసింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తెచ్చిన ధా న్యం తడిచిపోయింది. చేతికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో వృక్షాలు రహదారిపై పడ్డాయి. చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. విద్యుత్‌ తీగలు అస్తవ్యస్తంగా మారాయి.

జిల్లాలోని ఏడు మండలాల్లో 721 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. ఇందులో ఇబ్రహీంపట్నం 42 హెక్టార్లు, జగిత్యాల రూరల్‌ 121, ధర్మపురి 48, పెగడపల్లి 32, వెల్గటూరు 40, మల్లాపూర్‌లో 128 హెక్టార్లలో మామిడి పంట నష్టానికి గురైంది. ఐకేపీ, సింగిల్‌ విండో కేంద్రాల్లో విక్ర యానికి తెచ్చిన సుమారు 1,400 ధాన్యం బస్తాల ధాన్యం తడిచిపోయింది. ధాన్యం కుప్పల వద్ద వర్షపు నీరు నిలిచి రైతులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 ట్రాన్స్‌ఫార్మర్లు, 120 విద్యుత్‌ స్తంభాలు దె బ్బతిన్నాయి. ధర్మపురిలో విద్యుత్‌ తీగలు తెగిపడడం వల్ల ఓ గేదె మృతి చెందింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరాఫరాకు అం తరాయం కలిగింది. జిల్లాలోని రాయికల్‌లో 46.3 మిల్లీమీటర్లు, మేడిపల్లిలో 39 మిల్లీమీటర్లు, మెట్‌పల్లిలో 36.5 మిల్లీమీటర్లు, మల్యాలలో 35.8, ఇబ్ర హీంపట్నంలో 31.5 మిల్లీమీటర్లు, కొడిమ్యాలలో 20 మిల్లీమీటర్లు, కథలా పూర్‌లో 14.3 మిల్లీమీటర్లు, మల్లాపూర్‌లో 5 మిల్లీమీటర్లు, పెగడపల్లిలో 2 మిల్లీమీటర్లు, బీర్‌పూర్‌లో 2.5 మిల్లీమీటర్లు, కోరుట్లలో 2.5 మిల్లీమీటర్లు, వెల్గటూరులో 2.3 మిల్లీమీటర్లు, సారంగపూర్‌లో 2.3 మిల్లీమీటర్లు, గొ ల్లపల్లిలో  2.0 మిల్లీమీటర్లు, జగిత్యాల రూరల్‌లో 2 మిల్లీమీటర్లు, ధర్మపురి లో 0.8 ఎంఎం, బుగ్గారంలో 0.5 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు రికార్డులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2022-05-17T05:23:55+05:30 IST