నిర్మాణ‌రంగ కార్మికుల‌కు 'మిడ్ డే బ్రేక్'.. యూఏఈలో..

ABN , First Publish Date - 2020-06-03T16:59:44+05:30 IST

ప్ర‌స్తుత వేస‌విలో నిర్మార‌ణరంగంలో ప‌ని చేస్తున్న కార్మికుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం యూఏఈ సర్కార్‌‌ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

నిర్మాణ‌రంగ కార్మికుల‌కు 'మిడ్ డే బ్రేక్'.. యూఏఈలో..

యూఏఈ: ప్ర‌స్తుత వేస‌విలో నిర్మార‌ణరంగంలో ప‌ని చేస్తున్న కార్మికుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం యూఏఈ సర్కార్‌‌ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎండ‌లు మండుతుండ‌డంతో ఈ నెల 15 నుంచి 'మిడ్ డే బ్రేక్' అమ‌లు చేయాలంటూ అధికారుల‌ను ఆదేశించింది. మూడు నెల‌ల పాటు నిర్మాణాలు జ‌రుగుతున్న ప్ర‌దేశాల్లో ఈ నిబంధ‌న‌లు అమ‌లులో ఉంటాయ‌ని పేర్కొంది. మ‌ధ్యాహ్నం ప‌న్నెండున్న‌ర నుంచి మూడున్న‌ర వ‌ర‌కు 3 గంట‌లు మిడ్ బ్రేక్ టైంగా నిర్ధారించింది.


అలాగే ప‌ని ప్ర‌దేశాల్లో చ‌ల్ల‌ని నీరు, కార్మికులు డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా శ‌క్తినిచ్చే పానీయాలు అందుబాటులో ఉంచాల‌ని సూచించింది. అలాగే ఎండ‌ల ధాటికి కార్మికులు సొమ్మ‌సిల్లి ప‌డిపోయే అవ‌కాశం ఉన్నందున ప్రాథ‌మిక చికిత్స కిట్‌ను కూడా నిర్మాణ స్థ‌లాల్లో ఉంచాల‌ని ఆదేశించింది. కార్మికుల ప‌ని వేళ‌లు 8 గంట‌లుగా కార్మిక మంత్రిత్వ‌ ‌శాఖ నిర్ధారించింది. ఒక‌వేళ ఎవ‌రైనా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే 5వేల దిర్హామ్స్‌(రూ.1,02,406) నుంచి 50వేల దిర్హామ్స్‌(రూ.10,24,066) వ‌ర‌కు జ‌రిమానా విధిస్తామ‌ని కార్మిక ‌శాఖ అధికారులు హెచ్చ‌రించారు.  

Updated Date - 2020-06-03T16:59:44+05:30 IST