Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 12:27:32 IST

మధ్యాహ్న భోజన పథకానికి శివకుమారస్వామి పేరు

twitter-iconwatsapp-iconfb-icon
మధ్యాహ్న భోజన పథకానికి శివకుమారస్వామి పేరు

                         - సీఎం బసవరాజ్‌ బొమ్మై 


బెంగళూరు: మధ్యాహ్న భోజన పథకానికి సిద్దగంగా మఠాధిపతి శివకుమారస్వామిజీ పేరు పెడతామని, ఇందుకు సంబంధించి త్వరలోనే ఆదేశాలను జారీ చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. శుక్రవారం సిద్దగంగా మఠం ఆవరణలో శివకుమారస్వామిజీ 115వ జయంతి, గురువందనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నడిచే దేవుడిగా పేరొందిన శివకుమారస్వా మిజీ సన్నిధిలో ఓ భక్తుడిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ గడ్డపై స్వామిజీ స్ఫూర్తి, ప్రేరణ ఉందన్నారు. స్వామిజీ పరంపర కొనసాగడం భావితరాలకు ఓ సందేశమన్నారు. 88 ఏళ్లపాటు ఏటా వేలాది మంది విద్యార్థులకు విద్య, వసతి, భోజనం కల్పించిన ఘనత శివకుమార స్వామిదే అన్నారు. స్వామిజీ వెలిగించిన పొయ్యి నేటికీ విరాజిల్లుతోందని, నిరంతరంగా పేదల కడుపు నింపే ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య, వసతి ద్వారా లక్షలాది మంది అత్యున్నతమైన హోదాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామిజీ శిష్యులు ఉన్నారన్నారు. స్వామిజీ ధర్మగురువు మాత్రమే కాదని, జీవితాన్ని ఆదర్శంగా త్యాగం చేసిన వ్యక్తి అన్నారు. ఉత్తర కర్ణాటక వాసులు ఏటా వేలాదిమంది ఇక్కడ చదువుతారన్నారు. ఇక్కడ కులమతాలకు తావు లేదన్నారు. మాజీ సీఎం యడియూరప్ప హామీ మేరకు స్వామిజీ జయంతిని దాసోహదినం చేశామన్నారు. ఇదే వేదికపై యడియూరప్ప, స్వామిజీ చరిత్ర పాఠ్యాంశంగా తీసుకురావాలని కోరారు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.