ఇదేం ఆహారం

ABN , First Publish Date - 2021-02-26T06:04:40+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

ఇదేం ఆహారం
ఇంద్రపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు

  • నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థుల ఆందోళన
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

కాకినాడ రూరల్‌, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కాకినాడ రూరల్‌ మండలంలోని పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అల్లూరి సీతారామరాజు ట్రస్ట్‌ గతంలోనూ పలు పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని అందించింది. దీనిపై విద్యార్థులు భోజన కంచాలతో ఆందోళనకు దిగిన సంఘటన ఇంద్రపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగింది. పాఠశాలలో కొన్నిరోజులుగా ఆ హారం తింటుంటే కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం సరిగా ఉడక్క గట్టిగా ఉంటుందని తెలిపారు. గుడ్లు ఉడకడంలేదని, ఒక్కోసారి వాటినుంచి దుర్వాసన వస్తోందని వాపోయా రు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా ఉన్నా తినాలని ఉపాధ్యాయులు ఇ బ్బంది పెడుతున్నారని తెలిపారు. గురువారం ఆహారం బాగోక ఆవులకు తినిపించడం గమనార్హం. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయురాలు వి.నాగేశ్వరిని వివరణ కోరగా రెండురోజులుగా ఆహారం గట్టిగా ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2021-02-26T06:04:40+05:30 IST