ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీకి మైక్రోసాఫ్ట్‌ చెల్లుచీటీ

ABN , First Publish Date - 2022-07-02T08:52:07+05:30 IST

సాంకేతికతకు రెండు కోణాలు ఉంటాయి. ఒకటి అభివృద్ధికి చిహ్నమైతే మరొకటి మనిషి భావోద్వేగాలు సహా మరిన్నింటిపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు.

ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీకి మైక్రోసాఫ్ట్‌ చెల్లుచీటీ

సాంకేతికతకు రెండు కోణాలు ఉంటాయి. ఒకటి అభివృద్ధికి చిహ్నమైతే మరొకటి మనిషి భావోద్వేగాలు సహా మరిన్నింటిపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ సరిగ్గా అలాంటిదేనని గమనించిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సదరు సాంకేతికతకు స్వస్తి చెప్పింది. ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్న విమర్శలకు ఈ విధంగా జవాబు చెప్పింది. వయసు, జెండర్‌, జుత్తుపరంగా ఒక నిర్ణయానికి రావడానికి ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అది తగ్గించేందుకు సదరు టెక్నాలజీకి స్వస్తి పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తమ బ్లాగ్‌ పోస్టులో వివరించింది. ఏఐ ప్రోగ్రామింగ్‌ను సైతం ఇదే బాట పట్టించింది. ఇకపై ఈ రెండూ కొత్త యూజర్లకు అందుబాటులో ఉండవు. ఇప్పటికే వినియోగిస్తున్న వారికి మాత్రం వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు దీని యాక్సెస్‌ ఉంటుంది. విజన్‌ ఇష్యూ్‌సకు సంబంధించి వినియోగదారులకు ఉపయోగపడేందుకు ‘సీయింగ్‌ ఏఐ’ వంటి వాటితో కలిపి కంట్రోల్డ్‌(నియంత్రిత) యాక్సెసబిలిటీలో కల్పిస్తుంది. ఏఐ ఫేసియల్‌ రికగ్నిషన్‌ను కాస్తా రెస్పాన్సిబుల్‌ ఏఐ స్టాండర్డ్‌గా మారుస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. వాస్తవానికి 2019లో ఈ టెక్నాలజీని తీసుకువచ్చింది. తరవాత చేస్తున్న తొలి మార్పు ఇది. స్పీచ్‌-టు-టెక్స్ట్‌ ఫీచర్‌లో మరింత పారదర్శకత, న్యూరల్‌ వాయి్‌సలో ఆంక్షలు, ఎమోషన్‌ డిటెక్టింగ్‌ సిస్టమ్‌ తొలగింపు కూడా మైక్రోసాఫ్ట్‌ చేపడుతున్న చర్యల్లో ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఐబీఎం సైతం ఫేసియల్‌ రికగ్నిషన్‌ ప్రాజెక్టును నిలిపి వేసింది. ఈ సాంకేతికత ముఖ్యంగా మానవ హక్కుల దుర్వినియోగానికి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అతి పెద్ద క్లౌడ్‌, కంప్యూటింగ్‌ కంపెనీలు ఏఐ నుంచి వెనక్కు తగ్గుతున్న ఫలితంగా ఈ టెక్నాలజీపై నీలినీడలు పరుచుకోనున్నాయని ‘ఎంగేడ్జట్‌’  వ్యాఖ్యానించడం ఈ సందర్భంలో గమనార్హం. 

Updated Date - 2022-07-02T08:52:07+05:30 IST