Advertisement
Advertisement
Abn logo
Advertisement

మైక్రోసాఫ్ట్‌ షేర్లను విక్రయించిన సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల..కంపెనీలో తనకున్న షేర్లలో సగం షేర్లను విక్రయించారు. గత నెల 22-24 తేదీల మధ్య ఆయన మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో స్టాక్‌ ఆప్షన్‌ కింద తనకు సంక్రమించిన షేర్లలో 8.39 లక్షల షేర్లను విక్రయించారు. ఒక్కో షేరు సగటున 342 డాలర్ల చొప్పున విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా సత్య నాదెళ్ల 28.7 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,138 కోట్లు) సంపాదించారు. ఈ అమ్మకం తర్వాత కూడా సత్య నాదెళ్లకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో 8.31 లక్షల షేర్లు ఉన్నాయి. మంచి ధర ఉండడంతో ఆయన తన వాటా షేర్లలో కొన్ని షేర్లను విక్రయించినట్టు సమాచారం. 

Advertisement
Advertisement