మైక్రోసాఫ్ట్‌ మెచ్చిన వీడియోగేమ్‌

ABN , First Publish Date - 2020-03-05T05:56:26+05:30 IST

ఒక కొత్త ఆలోచన విజయానికి దారులు వేస్తుంది. గుర్తింపునూ తీసుకొస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణ లూథియానాకు చెందిన పదమూడేళ్ల నమ్య జోషి. స్థానిక సెయింట్‌ పౌల్‌ మిట్టల్‌...

మైక్రోసాఫ్ట్‌ మెచ్చిన వీడియోగేమ్‌

ఒక కొత్త ఆలోచన విజయానికి దారులు వేస్తుంది. గుర్తింపునూ తీసుకొస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణ లూథియానాకు చెందిన పదమూడేళ్ల నమ్య జోషి. స్థానిక సెయింట్‌ పౌల్‌ మిట్టల్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న నమ్య మైన్‌క్రా్‌ఫ్ట పేరుతో వీడియోగేమ్‌ తయారుచేసి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లను కలిసే అవకాశం దక్కించుకుంది. యంగ్‌ ఇన్నోవేటర్స్‌ సమ్మిట్‌లో భాగంగా సత్య నాదెళ్ల కొత్త కొత్త ఆవిష్కరణలు చేసిన యువతను కలుసుకున్నారు. అందులో భాగంగా నమ్య ఐడియాను సత్య నాదెళ్ల అభినందించారు. నమ్య తయారుచేసిన వీడియో గేమ్‌ పిల్లల్లో చదువుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. ఒకవేళ పిల్లలు పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి చూపకపోతే ఆ పాఠాలను మైన్‌క్రా్‌ఫ్టలో చూపించి ఆసక్తి కలిగేలా చేయవచ్చు. అంతేకాదు క్లాస్‌లో చెప్పే పాఠాలను ఇంటరాక్టివ్‌ సెషన్స్‌గా మార్చడానికి నమ్య కృషి చేస్తోంది. ఒక గేమ్‌ స్కూల్‌ కరిక్యులమ్‌తో ఇంటిగ్రేట్‌ చేయడమనే నమ్య ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. ‘‘మా అమ్మ ల్యాప్‌టా్‌పలో మైన్‌క్రా్‌ఫ్ట ఇన్‌స్టాల్‌ చేసి నా సొంతంగా ప్రయత్నించాను. బేసిక్స్‌ను అర్థం చేసుకున్నాను. కొన్ని ట్యుటోరియల్స్‌ చూశాను. ఆ తరువాత మైన్‌క్రా్‌ఫ్ట వీడియోగేమ్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాను’’ అంటారు నమ్య. తను ఇప్పటి 


వరకు 100 మందికి పైగా టీచర్లకు మైన్‌క్రా్‌ఫ్ట ఉపయోగించే విషయంలో శిక్షణ అందించింది.

Updated Date - 2020-03-05T05:56:26+05:30 IST