ఓఎన్‌డీసీలోకి మైక్రోసాఫ్ట్‌

ABN , First Publish Date - 2022-08-10T05:55:29+05:30 IST

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ కంపెనీ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌’ (ఓఎన్‌డీసీ) పేరుతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన కామన్‌

ఓఎన్‌డీసీలోకి మైక్రోసాఫ్ట్‌

భారత కస్టమర్ల కోసం షాపింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేసే ఆలోచనలో టెక్‌ దిగ్గజం

 

న్యూఢిల్లీ: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ కంపెనీ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు  ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌’ (ఓఎన్‌డీసీ) పేరుతో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన కామన్‌ గేట్‌వేలో అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా చేరింది. అంతేకాదు, భారత కస్టమర్ల కోసం మైక్రోసాఫ్ట్‌ ఓ షాపింగ్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు ఈ ఓపెన్‌ నెట్‌వర్క్‌ ద్వారా అన్ని పోర్టళ్ల నుంచి షాపింగ్‌ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, విక్రేతలకూ ప్రయోజనకరమే. ఎందుకంటే, వర్తకులు ప్రస్తుతం తమ ఉత్పత్తులను ప్రతి ఈ-కామర్స్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి పోర్టల్‌ ద్వారా విక్రయానికి విడివిడిగా డిజిటల్‌ మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కామన్‌ గేట్‌వే ద్వారా విక్రేతలకు సైతం ప్రయాస తప్పనుంది.


ప్రధానంగా గల్లీ స్థాయి కిరాణా షాపులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపేందుకు ఓఎన్‌డీసీ దోహదపడనుంది. అన్ని స్థాయిల విక్రేతలతో పాటు అన్ని వర్గాల కొనుగోలుదారులకూ ఆన్‌లైన్‌లో సమాన అవకాశాలు కల్పించడమే ఈ వేదిక ప్రధానోద్దేశం. డంజో ఫర్‌ బిజినెస్‌, గో ఫ్రుగల్‌, పేటీఎం, డిజిటల్‌, ఫోన్‌పే, లోడ్‌షేర్‌ ఇప్పటికే ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో చేరాయి. స్నాప్‌డీల్‌ కూడా ఈ నెలలోనే ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి కానుంది. 

Updated Date - 2022-08-10T05:55:29+05:30 IST