Abn logo
May 17 2021 @ 07:59AM

హైదరాబాద్‌ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్‌ భారీ ఆఫర్‌

రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు

హైదరాబాద్‌, మే 16: నగరానికి చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో రూ.2కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఎంఎస్‌ కంప్యూటర్స్‌ చదివిన దీప్తి.. ఈ నెల 2న జరిగిన క్యాంపస్‌ ఇంటర్వ్యూ ల్లో మైక్రోసా్‌ఫ్టలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. కంపెనీలోని సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌-2 కేటగిరీలో ఉద్యోగం లభించింది. ఈరోజు సియాటిల్‌లోని మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నారు. మైక్రోసాఫ్ట్తోపాటు గోల్డ్‌మాన్‌ శాక్స్‌, అమెజాన్‌ కంపెనీలు కూడా ఆఫర్లు ఇచ్చినా దీప్తి మైక్రోసాఫ్ట్‌ వైపు మొగ్గుచూపారు. దీప్తి తండ్రి డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఫోరెన్సిక్‌ నిపుణుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ (సీఎస్ఈ) తర్వాత జేపీ మోర్గాన్‌ కంపెనీలో మూడేళ్లు ఉద్యోగం చేసిన దీప్తి..ఆ తర్వాత ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లారు.


తాజా వార్తలుమరిన్ని...

Advertisement