Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆసియన్ అమెరికన్లపై దాడులను ఖండిస్తూ సత్య నాదెళ్ల ట్వీట్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్ అమెరికన్లకు భద్రత కరువవుతోంది. వారిపై జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులను ట్విట్టర్ వేదికగా ఆయన ఖండించారు. 2019తో పోల్చితే గత ఏడాది మార్చి-డిసెంబర్ మధ్య కాలంలో ఆసియన్ అమెరికన్లపై విపరీతంగా దాడులు జరిగాయని ఆసియన్ అమెరికన్ అడ్వకేసీ గ్రూప్ ఓ నివేదికలో పేర్కొంది. దాడులకు సంబంధించి 3వేలకుపైగా ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఎఫ్‌బీఐ గణాంకాల ప్రకారం 2019 లో 216 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 


ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ స్పందించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఆసియా అమెరికన్లకు మరియు ఆసియా సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిస్తున్నాయి. జాత్యహంకారానికి, ద్వేషానికి, హింసకు మన సమాజంలో స్థానం లేదు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆసియా, ఆసియా అమెరికన్ సమాజానికి అండగా నిలబడతా’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సత్య నాదెళ్లతోపాటు పలువురు అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఈ దాడులను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా వీటిని ఖండించారు. నిజమైన అమెరికన్లు దాడులు చేయరంటూ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement