మైసిగండిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-02T04:53:36+05:30 IST

మైసిగండిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

మైసిగండిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక అలంకరణలో మైసమ్మ అమ్మవారు

కడ్తాల్‌ : కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా రెండోరోజైన మంగళవారం అమ్మవారికి అర్చనలు, విశేష అలంకరణతో పూజలు నిర్వహించారు. మైసమ్మ దేవతను పట్టువస్ర్తాలతో చూడముచ్చటగా అలంకరించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కుబడులు సమర్పిస్తున్నారు. అమ్మవారి మహత్య సీడీలు, ప్రసాద విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ శిరోలీ పంతు, ఈవో స్నేహలత, ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్‌, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బిక్యనాయక్‌, సర్పంచ్‌ తులసీరాం నాయక్‌, జిల్లా ఎంపీటీసీల సంఘం గౌరవాధ్యక్షుడు గూడురు శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీటీసీ గురిగల్ల లక్ష్మయ్య, ఉత్సవ నిర్వాహకుడు రమావత్‌ భాస్కర్‌, నాయకులు రాంచందర్‌, బాబ, బిచ్యనాయక్‌,  పాండునాయక్‌, జవహర్‌లాల్‌ నాయక్‌, యాదగిరి, పంత్యనాయక్‌, శ్రీరాములు, హీరాసింగ్‌, హర్య నాయక్‌, రెడ్యనాయక్‌, బోడ్య నాయక్‌ , రాందాస్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:53:36+05:30 IST