పోలీసుల బంపర్ ఆఫర్.. విగ్రహాన్నిస్తే.. రూ.1లక్ష ఇస్తారట!

ABN , First Publish Date - 2021-03-20T05:44:25+05:30 IST

అమెరికా పోలీసులు భారీ రివార్డును ప్రకటించారు. దుండగులు ఎత్తుకెళ్లిన విగ్రహాన్ని సురక్షితంగా అప్పగిస్తే.. పెద్ద మొత్తంలో నగదును ఇస్తామని వెల్లడించారు. విషయంలోకి వెళితే.. అమెరికాలోని మి

పోలీసుల బంపర్ ఆఫర్.. విగ్రహాన్నిస్తే.. రూ.1లక్ష ఇస్తారట!

వాషింగ్టన్: అమెరికా పోలీసులు భారీ రివార్డును ప్రకటించారు. దుండగులు ఎత్తుకెళ్లిన విగ్రహాన్ని సురక్షితంగా అప్పగిస్తే.. పెద్ద మొత్తంలో నగదును ఇస్తామని వెల్లడించారు. విషయంలోకి వెళితే.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో వుడ్హావెన్ అనే నగరం ఉంది. ఈ పట్టణంలోని మెక్ డోనాల్డ్స్‌ ఔట్‌లెట్ వద్ద ఉండే రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ విగ్రహాన్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో స్పందించిన యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు.. ఆ విగ్రహాన్ని వెతికే పనిలో నిమగ్నమైపోయారు. ఈ క్రమంలోనే తాజాగా భారీ రివార్డును ప్రకటించారు. రొనాల్డ్ విగ్రహాన్ని సురక్షితంగా అప్పగించిన వారికి 1500 డాలర్లను అందిస్తామని వెల్లడించారు. 


Updated Date - 2021-03-20T05:44:25+05:30 IST