ప్రైవేట్ జెట్‌లో వచ్చి భారత్ వీధుల్లో శవాలను చూడండి: ఆస్ట్రేలియా ప్రధానిపై మైకేల్ స్లాటర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-06T16:11:39+05:30 IST

మానవ సంక్షోభం గురించి ఓ దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ స్లాటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రైవేట్ జెట్‌లో వచ్చి భారత్ వీధుల్లో శవాలను చూడండి: ఆస్ట్రేలియా ప్రధానిపై మైకేల్ స్లాటర్ ఆగ్రహం

మానవ సంక్షోభం గురించి ఓ దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ స్లాటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ రద్దవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భారత్‌ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ సీజన్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మైకేల్ స్లాటర్, ఆసీస్ ఆటగాళ్లు నేరుగా ఆస్ట్రేలియా వెళ్లడం కుదరడం లేదు. 


భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లి అక్కణ్నంచి ఆస్ట్రేలియా వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై స్లాటర్ విరుచుకుప‌డ్డాడు. `మాన‌వ సంక్షోభం గురించి ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావ‌డం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియ‌న్ భ‌యంలో ఉన్నాడన్నది నిజం. కావాలంటే మీరు మీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శ‌వాల‌ను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్‌ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాన'ని ట్వీట్ చేశాడు.  

Updated Date - 2021-05-06T16:11:39+05:30 IST