విరాట్‌పై మా వ్యూహం అదే..
ABN , First Publish Date - 2020-04-10T09:36:33+05:30 IST
ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల కోసం విరాట్ కోహ్లీని కవ్వించకుండా మా వాళ్లు నోటికి తాళాలేసుకున్నారని విమర్శించిన మైకేల్ క్లార్క్‌కు ఆస్ట్రేలియా టెస్ట్ ...
క్లార్క్ విమర్శలకు ఆసీస్ కెప్టెన్ పెయిన్ కౌంటర్
హోబర్ట్: ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల కోసం విరాట్ కోహ్లీని కవ్వించకుండా మా వాళ్లు నోటికి తాళాలేసుకున్నారని విమర్శించిన మైకేల్ క్లార్క్‌కు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పెయిన్ కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా ఆసీస్ టూర్‌లో కోహ్లీని రెచ్చగొట్టకూడదనే వ్యూహంలో భాగంగానే ఆ విధంగా వ్యవహరించినట్టు తెలిపాడు. ‘కోహ్లీ పట్ల ఎవరూ మెతక ధోరణి కనబరిచినట్టు నాకు అనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా అతడిని అవుట్ చేయకుండా ఉండాలనే ప్రయత్నమూ చేయలేదు. విరాట్‌ను కవ్విస్తే అతడు మరింతగా రెచ్చిపోయి భారీ స్కోరు సాధిస్తాడమోననే ఉద్దేశంతో అలా వ్యవహరించామ’ని చెప్పాడు. 2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ 2-1తో టెస్ట్ సిరీ్‌స నెగ్గి చరిత్ర సృష్టించింది. అయితే, ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కవనే భయంతోనే ఆ సిరీ్‌సలో ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించలేదని క్లార్క్ ఆరోపించిన సంగతి తెలిసిందే.