బెర్త్ కోసం ‘బెస్ట్’ పోరు..!

ABN , First Publish Date - 2020-10-28T22:35:33+05:30 IST

ఒకపక్క ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు. మరో పక్క ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన జట్టు. ఓ జట్టు వరుస గెలుపులతో దూసుకెళ్తుంటే.. మరో జట్టు ఓటములతో మొదలై, ఎన్నో ఎదురు దెబ్బలు తిని, చివరికి...

బెర్త్ కోసం ‘బెస్ట్’ పోరు..!

ఒకపక్క ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు. మరో పక్క ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన జట్టు. ఓ జట్టు వరుస గెలుపులతో దూసుకెళ్తుంటే.. మరో జట్టు ఓటములతో మొదలై, ఎన్నో ఎదురు దెబ్బలు తిని, చివరికి గెలుపుల బాట పట్టి.. చెమటోడ్చి ముందుకొచ్చిన జట్టు. అవే ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ముంబై అద్భుతంగా రాణిస్తోంది. అత్యధిక టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని టోర్నీ చరిత్రలోనే బెస్ట్ జట్టుగా నిలిచింది. ఇక బెంగళూరు విషయానికి వస్తే ఆ జట్టుకు టైటిల్ గెలవడం అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. టైటిల్ గెలవడం పక్కన పెడితే.. 2016 సీజన్‌లో తప్ప ఇప్పటివరకు ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది లేదు. అయితే ఈ టోర్నీలో ఆర్సీబీ గొప్పగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముంబైతో జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తొలిసారిగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోపక్క ముంబై కూడా టోర్నీపై తమ ఆధిపత్యాన్ని చూపించేలా తొలి ప్లేఆఫ్ బర్తును తానే సాధించాలని అనుకుంటోంది. 


ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా మరి కాసేపట్లో ముంబై-బెంగళూరు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. రెండు జట్లుకూ ఈ పోరు ఎంతో కీలకం. గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్‌కు చేరుతుంది. మునుపటి మ్యాచ్‌లలో రెండు జట్లూ ఓడడంతో ప్లేఆఫ్ బెర్తుపై సస్పెన్స్ నెలకొంది. ఈ మ్యాచ్‌లోనైనా ఎలాగోలా గెలిచి బెర్త్ ఖాయం చేసుకోవాలని రెండు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో బెంగళూరుపై ముంబైదే పైచేయిగా ఉంది. అన్ని సీజన్లలో కలిపి రెండు జట్లూ 26 సార్లు తలపడగా.. 16 సార్లు ముంబై జట్టే గెలిచింది. బెంగళూరు కేవలం 10 సార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ ఏడాది టోర్నీలో మాత్రం ముంబై-బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు విజయఢంకా మోగించింది. రెండు జట్లూ 201 పరుగలతో భారీ స్కోర్లు సాధించడంతో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో బెంగళూరు గెలుపొందింది.


ఇదిలా ఉంటే ఈ రోజు మ్యాచ్‌ జరగనున్న అబుధాబీ స్టేడియంలో బెంగళూరు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలిచింది. ఇక ఇదే స్టేడియంలో 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఐదింట గెలిచి మూడింట ఓడిపోయింది. ఇక రోహిత్ శర్మ లేకపోవడం ముంబైకి పెద్ద లోటనే చెప్పాలి. జట్టును ఎప్పుడూ ముందుండి నడిపించే రోహిత్ లేకపోవడంతో ముంబై ఒత్తిడికి గురైనట్లుంది. రాజస్థాన్‌తో గత మ్యాచ్‌లో ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. రోహిత్ లేకపోవడంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు పొలార్డ్ చేపట్టాడు. ఇక బెంగళూరు కూడా గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ అది జట్టులో చేసిన మార్పుల కారణంగానే అని చెప్పవచ్చు. ఈ ఓటమిని బెంగళూరు గుణపాఠంగా తీసుకుని మళ్లీ పాత టీంతోనే బరిలోకి దిగితే గెలుపు సొంతం చేసుకోవచ్చు. మరి రోహిత్ గై ఇక పిచ్ విషయానికి వస్తే.. మొదట్లో బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌లు ఆ తర్వాత బౌలర్లకు సహకరించడంతో స్కోర్లు తగ్గిపోయాయి. 130 పరుగులను కూడా కొన్ని జట్లు కాపాడుకుని విజయం సాధించాయి. కానీ ఇప్పడు పరిస్థితి మారినట్లుంది. పిచ్‌లు మళ్లీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారినట్లున్నాయి. గత మ్యాచ్‌ల స్కోర్లు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అంటే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమన్నమాట. 

Updated Date - 2020-10-28T22:35:33+05:30 IST