కొత్త మోడల్‌లో Mi TV టీజర్ విడుదల

ABN , First Publish Date - 2021-08-22T00:46:39+05:30 IST

కొత్త మోడల్‌లో Mi TV టీజర్ విడుదల

కొత్త మోడల్‌లో Mi TV టీజర్ విడుదల

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ ఎంఐ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ టీవీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో ఆగస్టు 26న ఎంఐ టీవీ 5ఎక్స్ టీవీని విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఎంఐ టీవీ 5ఎక్స్ టీవీకి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. ఎంఐ టీవీ 5ఎక్స్ టీవీకి సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. టీవీ ధర ఎంత ఉంటుందనేది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Updated Date - 2021-08-22T00:46:39+05:30 IST