వాళ్ల మృతిపై సీబీఐ దర్యాప్తు

ABN , First Publish Date - 2021-07-14T06:14:19+05:30 IST

హర్యానాలోని గురుగ్రామ్‌ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇద్దరు వ్యక్తుల మరణంపై కేంద్ర హోం శాఖ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. నాగాల్యాండ్‌కు..

వాళ్ల మృతిపై సీబీఐ దర్యాప్తు

గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇద్దరు వ్యక్తుల మరణంపై కేంద్ర హోం శాఖ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. నాగాల్యాండ్‌కు చెందిన రోసీ, శామ్యూల్ సంగ్మా అనే ఇద్దరు వ్యక్తులు ఇటీవల గురుగ్రామ్‌లో మరణించారు. వీరిలో రోజీ.. జూన్ 24న ఆసుపత్రిలో మరణించారు. అయితే రోజీ మరణం వైద్యుల నిర్లక్ష్యం వల్లనే సంభవించిందని ఆరోపణలున్నాయి. ఇక ఆమె బంధువు శామ్యూల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సంగ్మ మరణంపై అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. సంగ్మా ఆత్మహత్య చేసుకోలేదని ఆరోపించారు. అతడి మరణం వెనక ఏదో రహస్యం ఉందని పేర్కొన్నారు. దీంతో కేంద్ర హోం శాఖ వీరి మరణంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐను ఆదేశించింది.

Updated Date - 2021-07-14T06:14:19+05:30 IST