Abn logo
Sep 25 2020 @ 19:42PM

బాలు కోసం షూటింగ్ ఆపిన టాప్ హీరో

Kaakateeya

చెన్నై: బాలు వర్ధమాన గాయకుడిగా ఎదుగుతున్న రోజులవి. 'ఎవరో బాలు అనే కొత్త కుర్రాడట...బాగా పాడుతున్నాడు' అంటూ అప్పుడప్పుడే ఆయన గురించి పరిశ్రమలో వినిపిస్తోంది. సహజంగా ఎవరికైనా బాగా ఎదిగిన తర్వాత అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. ఆ సమయంలో బాలు ఊహించని విధంగా నాటి టాప్ హీరో, తమిళుల ఆరాధ్య నటుడు ఎమ్జీఆర్ దృష్టిలో పడ్డారు. ఇంకేముంది? వెంటనే బాలుకు ఆయన నుంచి పిలుపు వచ్చింది.

ఎంజీఆర్ 'ఆయిరం నిలవే వా' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడిగా జయలలితను ఎంపిక చేశారు. ఎమ్జీఆర్-జయలలిత అంటే సూపర్ సక్సెస్ కాంబినేషన్‌‌. అందులో బాలుకు ఓ పాట పాడే అవకాశం ఇచ్చారు ఎమ్జీఆర్. అయితే, రికార్డింగ్‌కు ముందే బాలుకు టైఫాయిడ్ వచ్చింది. ఆయన ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఎమ్జీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. బాలుతోనే పాటించాలనే పట్టుదలతో ఉన్నారు. బాలు టైఫాయిడ్ నుంచి కోలుకునేంత వరకూ పాట చిత్రీకరణ నిలిపివేశారు. తక్కిన పార్ట్  షూటింగ్ కొనసాగించారు. కొద్దిరోజులకు బాలు కోలుకోగానే ఆయన చేత సాంగ్ రికార్డు చేయించారు. ఆ వెంటనే జైపూర్‌లో పాట చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా విడుదలై పెద్ద హిట్టయింది. బాలు పాడిన పాట సూపర్ డూపర్ హిట్‌గా నిలివడమే కాకుండా, ఎమ్జీఆర్‌కు బాలు పాడిన తొలిపాటగా నిలిచిపోయింది.

Advertisement
Advertisement
Advertisement