ఎంజీఆర్‌ వర్సిటీ వీసీ పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2022-04-12T15:29:34+05:30 IST

ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి సుధా శేషసాయి పదవీకాలాన్ని డిసెంబరు 30వ తేది వరకు పొడిగిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఎంజీఆర్‌ వర్సిటీ వీసీ పదవీకాలం పొడిగింపు

పెరంబూర్‌(చెన్నై): ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి సుధా శేషసాయి పదవీకాలాన్ని డిసెంబరు 30వ తేది వరకు పొడిగిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు డాక్టర్‌ ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం 1987లో ప్రారంభం కాగా, వర్శిటీ 10వ ఉపకులపతిగా 2018 డిసెంబరు 31న డా.సుధా శేషయ్యన్‌ నియమితులయ్యారు. ఆమె పదవీకాలం గత ఏడాది డిసెంబరు 30వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో కొత్త వీసీ ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకాగా, 37 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను కమిటీ గవర్నర్‌కు పంపించగా, ఒకరిని గవర్నర్‌ ఎంపిక చేయనున్నారు. ఈ నేపధ్యంలో, సుధా శేషయ్యన్‌ పదవీకాలాన్ని డిసెంబరు 30వ తేది వరకు పొడిగిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీచేశారు. కొత్త వీసీని ఎంపిక మరో రెండు నెలల్లో తెలిసే అవకాశముందని వర్సిటీ వర్గాల సమాచారం.

Updated Date - 2022-04-12T15:29:34+05:30 IST