Abn logo
May 19 2021 @ 00:19AM

అమెజాన్‌ చేతికి ఎంజీఎం స్టూడియో!

డీల్‌ విలువ 900 కోట్ల డాలర్లు 


న్యూయార్క్‌: అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. తన ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అనేక సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమాలు నిర్మించిన మెట్రో-గోల్డ్‌విన్‌-మేయర్‌ (ఎంజీఎం) మూవీ స్డూడియోపై కన్నేసింది. ఇందుకోసం ఇప్పటికే రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 900 కోట్ల డాలర్లకు ఎంజీఎం స్టూడియో కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ సిద్ధమైట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు రెండు కంపెనీలు నిరాకరించాయి. ఎంజీఎం స్టూడియో, అమెజాన్‌ పరమైతే ఆ సంస్థ చేతిలోని జేమ్స్‌బాండ్‌ సినిమాలతో పాటు అనేక సూపర్‌ డూపర్‌ హిట్‌ హాలీవుడ్‌ సినిమాలు అమెజాన్‌ పరమవుతాయి.