Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 05 May 2022 20:59:23 IST

రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ దర్శకత్వంలో ‘On Air’

twitter-iconwatsapp-iconfb-icon
రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ దర్శకత్వంలో On Air

హీరో, దర్శకుడిగా కన్నడలో ‘బీర్బల్ ట్రయాలజీ (Birbal Trilogy), ఓల్డ్ మంక్ (Old Monk)’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఎం జి శ్రీనివాస్ (శ్రీని) (MG Srinivas -Srini) మరో విభిన్న థ్రిల్లర్‪తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఆన్ ఎయిర్’ (On Air) అనే ఆసక్తికరమైన టైటిల్‪తో రానున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్‪జే‪గా కనిపించనున్నారు. ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయం ఖాయమని అటు శ్రీనితో పాటు చిత్రయూనిట్ కూడా కాన్ఫిడెంట్‪గా చెబుతోంది. 


కాగా,  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలైలో ప్రముఖ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’ (Bahubali), ‘ఆర్ ఆర్ ఆర్’ (RRR) వంటి పలు భారీ చిత్రాల రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అసోసియేట్ ప్రశాంత్ సాగర్ (Prasanth Sagar).. ఈ ‘ఆన్ ఎయిర్’కు దర్శకత్వం వహించారు. వాయిపుత్ర ఎంటర్‪టైన్‪మెంట్స్, యస్ ఒరిజినల్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి రఘువీర్ గోరిపర్తి (Raghuveer GoriParthi), సృజన్ యరబోలు (Srujan Yarabolu)  నిర్మాతలు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement