మెక్సికోలో 10 మంది హత్య... బ్రిడ్జికి వేలాడుతున్న శవాలు

ABN , First Publish Date - 2021-11-20T07:41:12+05:30 IST

మెక్సికోలో 10 మంది వ్యక్తుల మృతదేహాలను అధికారులు కనుక్కున్నారు. వీటిలో 9 మృతదేహాలు ఒక బ్రిడ్జికి వేలాడుతూ

మెక్సికోలో 10 మంది హత్య... బ్రిడ్జికి వేలాడుతున్న శవాలు

మెక్సికో, నవంబరు 19: మెక్సికోలో 10 మంది వ్యక్తుల మృతదేహాలను అధికారులు కనుక్కున్నారు. వీటిలో 9 మృతదేహాలు ఒక బ్రిడ్జికి వేలాడుతూ కనిపించాయి. మరో మృతదేహం సమీపంలోని హైవే మీద ఉంది. సెంట్రల్‌ మెక్సికోలోని జెకాటెకాస్‌ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. క్రిమినల్‌ గ్యాంగ్‌ల మధ్య గొడవలే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. హత్యలపై లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-11-20T07:41:12+05:30 IST