Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ Mexico ర్యాపర్ హెయిర్ స్టైల్ అదుర్స్.. Gold గొలుసులే కురులు

బంగారం అంటే ఇష్టపడే వారు సాధారణంగా నగోనట్రో చేయించుకుంటారు. డబ్బులు మరీ ఎక్కువైతే ఒళ్లంతా నగలు దిగేసుకుని డాబూదర్పం ప్రదర్శిస్తారు. నోట్లో బంగారపు పన్ను బిగించుకున్న వారు కూడా అప్పుడప్పుడూ తారసపడుతుంటారు. కానీ.. తలపై వెంట్రుకల స్థానంలో గోల్డ్ గొలుసులు అమర్చుకోవడం గురించి ఎప్పుడైన విన్నారా..? వింతగా ఉంది కదూ..! కానీ ఇది నిజం.

మెక్సికోకు చెందిన ర్యాపర్ డ్యాన్ సుర్‌కు బంగారం అంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే శరీరమంతా బంగారు ఆభరణాలతో నింపుకున్నాడు. చెవులకు దుద్దులు. ముక్కుకు పుడక. చేతులకు ఉంగరాలు. చేతులకు బ్రేస్‌లెట్లు. అలాగే పళ్లు కూడా బంగారంతో చేయించుకుని తగిలించుకున్నాడు. ఇక బంగారంతో ఏం చేయించుకోవాలో తెలియక ఏకంగా తన తలపై జుట్టంతా తీయించేసి దాని బదులు బంగారు గొలుసులను సర్జరీ ద్వారా తగిలించుకున్నాడు. అలాగే ఈ భూమ్మీద తానే మొట్టమొదటి బంగారు గొలుసుల జుత్తు కలిగిన ర్యాపర్ అని గొప్పగా చెప్పుకుంటున్నాడు.

‘నిజానికి అందరూ తమ జుత్తుకు డై(రంగు) వేసుకుంటారు. కానీ నేను కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా. అందుకే ఇలా జుత్తు మొత్తం తీయించేసి దాని స్థానంలో బంగారు గొలుసులను ఏర్పాటు చేయించుకున్నా. తలపై ఉన్న చర్మంలో ఓ హుక్ ఏర్పాటు చేయించి, దానిపై మరో హుక్, దానికి ఈ గొలుసులన్నీ తగిలించుకునేలా సర్జరీ చేయించుకున్నాను. ఈ స్టైల్ కలిగిన ఒకేఒక్క ర్యాపర్ నేనే. నన్ను ఎవరూ కాపీ కొట్టకూడదని కోరుకుంటున్నా’ నని డ్యాన్ పేర్కొన్నాడు. తన న్యూ హెయిర్ స్టైల్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను డ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో షేర్ చేశాడు. దీంతో ఇప్పుడీ వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అతడి హెయిర్‌స్టైల్‌ను, సరికొత్త ఆలోచను ప్రశంసిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement