యాంటీ బాడీలున్నాయి.. వ్యాక్సిన్ తీసుకోను: మెక్సికో అధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-04-06T12:19:17+05:30 IST

మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లోపెజ్(67) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు యాంటీ బాడీలు

యాంటీ బాడీలున్నాయి.. వ్యాక్సిన్ తీసుకోను: మెక్సికో అధ్యక్షుడు

మెక్సికో సిటీ: మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లోపెజ్(67) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు యాంటీ బాడీలు హై లెవల్‌లో ఉన్నాయని వైద్యులు చెప్పారని, అందుకని తాను వ్యాక్సిన్ తీసుకోబోనని ఆయన అన్నారు. ఈ ఏడాది జనవరిలో ఆండ్రెస్ కరోనా బారిన పడ్డారు. తన వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానంటూ ఇటీవల ఆండ్రెస్ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆయన మాట మార్చడంతో ఆండ్రెస్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. కాగా.. మెక్సికోలో ఇప్పటివరకు మొత్తం 22,50,458 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మొత్తం 2,04,147 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క మెక్సికో వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 90 లక్షల మంది వ్యాక్సిన్ డోస్‌ను తీసుకున్నారు. 

Updated Date - 2021-04-06T12:19:17+05:30 IST