Metturu Damలో పెరిగిన నీటిమట్టం

ABN , First Publish Date - 2022-05-19T15:27:04+05:30 IST

సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలోని డ్యాం నీటిమట్టం 109.45 అడుగులకు పెరిగిందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. కావేరి నది పరివాహాక ప్రాంతాల్లో కొన్ని

Metturu Damలో పెరిగిన నీటిమట్టం

ప్యారీస్‌(చెన్నై): సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలోని డ్యాం నీటిమట్టం 109.45 అడుగులకు పెరిగిందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. కావేరి నది పరివాహాక ప్రాంతాల్లో  కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా మేట్టూరు డ్యాంలో సెకనుకు 9,546 ఘనపుటడుగుల నీరు చేరుతుండడంతో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, డ్యాం నుంచి తాగునీటి అవసరాలకు సెకనుకు 1,500 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 108.14 అడుగులుగా ఉన్న డ్యాం నీటిమట్టం బుధవారం ఉదయానికి 109.45 అడుగులకు పెరిగిందని, డ్యాంలో చేరుతున్న నీటి శాతం భారీగా ఉన్నందువల్ల కావేరి డెల్టా సాగుకు సకాలంలో నీటిని విడుదల చేసే అవకాశముందని డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నీటిమట్టం పెరగడంతో మత్స్యసంపద పెరిగే అవకాశముందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-19T15:27:04+05:30 IST