Mettur Reservoir: 26 రోజులుగా 120 అడుగుల నీటిమట్టం

ABN , First Publish Date - 2022-08-12T15:37:00+05:30 IST

సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Reservoir) 26వ రోజుగా గురువారం 120 అడుగులు (పూర్తి సామర్ధ్యం)లతో నిండి ఉంది. కావేరి పరివాహక

Mettur Reservoir: 26 రోజులుగా 120 అడుగుల నీటిమట్టం

                                      - పూర్తి సామర్థ్యంతో మేట్టూరు జలాశయం


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 11: సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Reservoir) 26వ రోజుగా గురువారం 120 అడుగులు (పూర్తి సామర్ధ్యం)లతో నిండి ఉంది. కావేరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని డ్యాంల నుంచి విడుదల చేసిన నీటితో గత నెల 16వ తేది డ్యాం పూర్తిస్థాయికి చేరింది. అప్పటి నుంచి ఇన్‌ఫ్లో 2 లక్షలకు పైగా ఉండడంతో అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు. గురువారం ఉదయం డ్యాంకు 1.40 లక్షల ఘనపుటడుగుల నీరు వస్తుండగా, అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-12T15:37:00+05:30 IST